విజయమ్మ నేతృత్వంలో సమైక్య రైతు శంఖారావం | Samaikya Raitu Sankharavam under the leadership of vijayamma | Sakshi
Sakshi News home page

విజయమ్మ నేతృత్వంలో సమైక్య రైతు శంఖారావం

Sep 16 2013 3:47 PM | Updated on Sep 1 2017 10:46 PM

విజయమ్మ నేతృత్వంలో సమైక్య రైతు శంఖారావం

విజయమ్మ నేతృత్వంలో సమైక్య రైతు శంఖారావం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో త్వరలో సమైక్య రైతు శంఖారావం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.

హైదరాబాద్‌: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో త్వరలో సమైక్య రైతు శంఖారావం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి  సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో రైతులు వేలాదిగా ట్రాక్టర్లతో  పాల్గొంటారని చెప్పారు.  షర్మిల సమైక్యశంఖారావం బస్సుయాత్రకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రం విడిపోతే ఎక్కువగా నష్టపోయేది రైతాంగమేనన్నారు.  సమైక్యాంధ్ర కోరుకునే ప్రతి ఒక్కరూ సమైక్యరైతు శంఖారావంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మరో ఒకటి, రెండు రోజుల్లో సమైక్య రైతు శంఖారావం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement