
విజయవాడలో సాక్షి టీవీ నూతన స్టూడియో
విజయవాడలో సాక్షి టీవీ నూతన స్టూడియోను ప్రారంభించారు.
విజయవాడ: తెలుగువారికి, ఆంధప్రదేశ్ ప్రజలకు సాక్షి టీవీ మరింత చేరువైంది. విజయవాడలో సాక్షి టీవీ నూతన స్టూడియోను ప్రారంభించారు. ఆదివారం ఆటో నగర్ కేంద్రంగా సాక్షి టీవీ ప్రసారాలు మొదలయ్యాయి.
ఇకనుంచి విజయవాడ స్టూడియోలో కూడా న్యూస్ డిస్కషన్‌లు, డిబేట్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ స్టూడియో నుంచి సంయుక్తంగా ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రసారం చేస్తారు.