సాక్షి - ఎస్.వి.సి.ఈ.టి. మాక్ ఎంసెట్ | sakshi mak emset | Sakshi
Sakshi News home page

సాక్షి - ఎస్.వి.సి.ఈ.టి. మాక్ ఎంసెట్

Mar 28 2015 1:34 AM | Updated on Sep 2 2017 11:28 PM

సాక్షి - ఎస్.వి.సి.ఈ.టి. మాక్ ఎంసెట్

సాక్షి - ఎస్.వి.సి.ఈ.టి. మాక్ ఎంసెట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో

రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సాక్షి మాక్ ఎంసెట్ నిర్వహించనుంది. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) చిత్తూరు.. ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా, సెంట్రల్ ఆంధ్రా రీజినల్ స్పాన్సర్‌గా నలందా ఇన్‌స్టిట్యూట్ ఆ్‌ఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (గుంటూరు) వ్యవహరిస్తుంది.

మే నెలలో జరుగనున్న ఎంసెట్‌కు సరిగ్గా నెల రోజు ముందు సాక్షి నిర్వహించనున్న ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా.. తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చని ప్రశ్న పత్రాలను తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగు పరుచుకునేందుకు వీలవుతుంది. దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులుంటాయి. సాక్షి మాక్ ఎంసెట్‌కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 2లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మార్చి 12 నుండి ఎంపిక చేసిన సాక్షి కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు వెల రూ.75 తో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు తీసుకుని వస్తే వెంటనే హాల్ టిక్కెట్ పొందొచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement