చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్ | sake sailajanath demand for hang chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్

Sep 23 2014 1:30 PM | Updated on Jun 1 2018 8:39 PM

చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్ - Sakshi

చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్

రైతులు, మహిళలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్ అన్నారు.

కళ్యాణదుర్గం: రైతులు, మహిళలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్ అన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం శైలజానాథ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు కళ్యాణదుర్గం భవన్ (పీసీసీ అధ్యక్షుడు రఘువీరా నివాసం) నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద రెండు గంటల పాటు బైఠాయించారు.

ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ యోగ్యత లేనప్పుడు హామీలు గుప్పించి రైతులను, మహిళలను మోసం చేయడం ఎంత వరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. ‘ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చావో ప్రజల ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలరా’ అంటూ నిలదీశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దాన్ని నెరవేర్చారని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement