పోలీసులు సైనికుల్లా పనిచేస్తున్నారు : సజ్జల | Sajjala applauds Police services in AP | Sakshi
Sakshi News home page

పోలీసులు సైనికుల్లా పనిచేస్తున్నారు : సజ్జల

Apr 1 2020 10:23 AM | Updated on Apr 1 2020 10:30 AM

Sajjala applauds Police services in AP - Sakshi

సాక్షి, గుంటూరు : ప్రపంచానికి కష్టకాలం వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనాకు పూర్తి స్థాయి మందు రాలేదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మనకున్న వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామన్నారు. మిగిలిన రాష్ట్రాలకంటే మన దగ్గర కొంత మెరుగ్గా ఉందని, పోలీసులు సైనికుల్లాగ పనిచేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

పోలీసులకు శానిటైజర్లు, మాస్కులను బుధవారం సజ్జల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ ప్రభాకరరావు, ఎమ్మెల్యే మద్దాల గిరి, కార్పొరేషన్ కమిషనర్ అనురాధ, వైఎస్సార్‌సీపీ నేతలు మోదుగుల, ఎల్.అప్పిరెడ్డి, యార్డు ఛైర్మన్ ఏసురత్నం హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement