తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఈటెల రాజేందర్ వ్యాఖ్యలతో అసెంబ్లీ సోమవారం స్తంభించింది.
హైదరాబాద్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఈటెల రాజేందర్ వ్యాఖ్యలతో అసెంబ్లీ సోమవారం స్తంభించింది. పయ్యావుల ....సోనియా గాంధీ ఇటాలియన్ అంటూ చేసిన వ్యాఖ్యలపై శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ అధినేత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదని శైలజానాథ్ అన్నారు.
మరోవైపు నిజాం పాలను ప్రశంసిస్తూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపైనా శైలజానాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాం కాలంలో అభివృద్ధితో పాటు పరిశ్రమలు కూడా వచ్చాయన్న ఈటెల వ్యాఖ్యలను అడ్డుకున్నారు. నిజాం కాలాన్ని కీర్తించటమంటే రాజ్యాంగాన్ని అవమానపరచటమేనని శైలజనాథ్ అన్నారు. దానిపై ఈటెల స్పందిస్తూ నిరంకుశత్వానికి మద్దతు ఇవ్వలేదని సమర్థించుకున్నారు.