'బీజేపీతో సబ్బంహరికి చీకటి ఒప్పందం' | Sabbam Hari hand in glow with BJP, Visakhapatnam YSRCP leaders | Sakshi
Sakshi News home page

'బీజేపీతో సబ్బంహరికి చీకటి ఒప్పందం'

May 6 2014 6:46 PM | Updated on Aug 14 2018 4:24 PM

'బీజేపీతో సబ్బంహరికి చీకటి ఒప్పందం' - Sakshi

'బీజేపీతో సబ్బంహరికి చీకటి ఒప్పందం'

విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో పోటి నుంచి తప్పుకున్న జైసమైక్యాంధ్ర అభ్యర్థి సబ్బంహరి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా నేతలు మళ్ల విజయప్రసాద్, ఫైనాల విజయకుమార్ మండిపడ్డారు.

విశాఖ: విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో  పోటి నుంచి తప్పుకున్న జైసమైక్యాంధ్ర అభ్యర్థి సబ్బంహరి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  విశాఖ జిల్లా నేతలు మళ్ల విజయప్రసాద్, ఫైనాల విజయకుమార్ మండిపడ్డారు.  
 
సబ్బం హరి అసత్యాలు మాట్లాడుతున్నారని విశాఖ నగర వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ విమర్శించారు.  మహానేత వైఎస్ఆర్ కుటుంబం గురించి తప్పుడు మాటలు సరికాదని ఆయన హితవు పలికారు. 
 
బీజేపీతో సబ్బంహరి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు ఫైనాల విజయకుమార్ ఆరోపించారు.  రెండు పార్టీల నుంచి సస్పెండ్ అయిన సబ్బం హరి ప్రజల మనసు నుంచి కూడా సస్పెండ్ అయ్యారన్నారు. విశాఖ పార్లమెంట్ బరి నుంచి తప్పుకుని బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement