ఫిట్‌మెంట్‌వల్ల రూ.960 కోట్ల భారం పడిందని, అందువల్ల చార్జీల పెంపు అనివార్యమని ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు
⇒ బెజవాడ బస్టాండులో నేటినుంచి వై-ఫై సేవలు
ఒంగోలు: ఫిట్‌మెంట్‌వల్ల రూ.960 కోట్ల భారం పడిందని, అందువల్ల చార్జీల పెంపు అనివార్యమని ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. అయితే అదెంతనే విషయం ప్రభుత్వంతో చ ర్చల అనంతరం ప్రకటిస్తామన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోను ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ అనేక డిపోలు నష్టాల్లో ఉన్నాయన్నారు. అవన్నీ లాభాలు గడిస్తేనే ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కుతుందన్నారు. అక్రమ రవాణా అరికట్టడమే అందుకు మార్గమని చెప్పారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండులో సోమవారం నుంచి వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు.