రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం | rs.1 crore worth red sandal seized in ysr distirict | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

May 13 2015 10:36 AM | Updated on Sep 3 2017 1:58 AM

వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం మట్టిపల్లి గ్రామ సమీప అడవిలోరూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సిద్దవటం: వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం మట్టిపల్లి గ్రామ సమీప అడవిలోరూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున జరిగింది. వివరాలు...ఏ, బీ గ్రేడ్‌కు చెందిన రెండు టన్నుల ఎర్రచందనం దుంగలను లారీలో తరలించేందుకు సిద్ధం చేస్తుండగా ముందస్తు సమాచారంతో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంలో స్మగ్లర్లు, కూలీలు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ కోటి రూపాయలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఎర్రచందనం దుంగలను, లారీని కడప అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement