బనశంకరి: పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం దుంగలను ఉల్లిపాయల బస్తాల్లో దాచి సరుకు వాహనంలో తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు సభ్యుల ముఠాను ఆదివారం బెంగళూరులోని సిద్ధాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 750 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన షేక్ అబ్దుల్ కలాం, షేక్ నాసీర్, పరమేశ్, రామ్ బహద్దూర్ సభ్యుల ముఠా నుంచి గూడ్స్ వాహనం, మహీంద్రా పికప్ వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిì కోసం గాలిస్తున్నారు.
నగరంలోని సోమేశ్వరనగర ఆర్చ్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేసే సమయంలో గూడ్స్ వాహనంలో ఉల్లిపాయల బస్తాల్లో దాచిపెట్టిన ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటిని వెంటనే స్వా«దీనం చేసుకున్నారు. ఈ వాహనం వెనుక ఉన్న మహీంద్ర వాహనాన్ని సైతం స్వా«దీనం చేసుకుని అందులో ఉన్న ముగ్గురితో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలను కర్నూలు అటవీ ప్రాంతం నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
కానీ ఎర్రచందనం దుంగలను ఎవరు తరలిస్తున్నారనే విషయం తెలియరాలేదు. ముఖ్య నిందితుడు పట్టుబడిన అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. పోలీస్ వర్గాల ప్రకారం ఎర్రచందనం దుంగలను బెంగళూరు నగరం నుంచి విదేశాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. పట్టుబడిన నలుగురు నిందితులు ఏపీలోని
ఏ జిల్లా వాసులనేది పోలీసులు వెల్లడించలేదు.


