
తెనాలిలో రౌడీషీటర్ దారుణ హత్య
ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సోమవారం రాత్రి జరిగింది.
- పాత కక్షలే కారణం
తెనాలిరూరల్(గుంటూరు): ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు..స్థానిక బాలాజీరావుపేటకు చెందిన షేక మస్తాన్‌వలీ(26)ని గుర్తుతెలియని దుండగులు గంగానమ్మపేటలోని మసీదు సమీపంలో దారుణంగా హత్య చేశారు. మృతదేహం సమీపంలో బైక్, సెల్‌ఫోన్ పడి ఉన్నాయి. కాగా, మస్తాన్ వలీ సెల్‌ఫోన్ అతని ఫ్యాంటు జేబులోనే ఉంది.
సంఘటనాస్థలంలో పడి ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, మస్తాన్ 2013లో తన భార్య రిజ్వానా హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా గతేడాది తాళ్ల కిషోర్ అనే యువకుడిపై హత్యాయత్నం కేసు సహా పలు కేసుల్లో మస్తాన్ నిందితుడు. అతనిపై తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉంది. పాత కక్షలు కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వారు తెలిపారు.