రేకులు తొలగించి సెల్ ఫోన్స్ చోరీ | Robbery in Cell phone shop | Sakshi
Sakshi News home page

రేకులు తొలగించి సెల్ ఫోన్స్ చోరీ

Jul 30 2015 3:14 PM | Updated on Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వీఎంసీ సెంటర్ వద్దనున్న శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్‌ప్రైజైస్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు పడ్డారు.

శ్రీకాళహస్తి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వీఎంసీ సెంటర్ వద్దనున్న శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్‌ప్రైజైస్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు పడ్డారు. దుకాణంపైనున్న రేకులు తొలగించి షాపులో ఉన్న రూ.87 వేల నగదు, రూ.లక్షా యాభై వేలు విలువ చేసే మొబైల్ ఫోన్లు తస్కరించారు.

షాపు యజమాని సుధాకర్ గురువారం ఉదయం షాపు తెరిచి చూసే సరికి పైన రేకులు తొలగించి ఉన్నాయి. షాపులో దొంగలు పడిన విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement