జీటీ ఎక్స్ప్రెస్లో దొంగల హల్చల్ | robbery attempts in GT express | Sakshi
Sakshi News home page

జీటీ ఎక్స్ప్రెస్లో దొంగల హల్చల్

May 6 2016 10:10 AM | Updated on Aug 30 2018 5:27 PM

న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న జీటీ ఎక్స్ప్రెస్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు.

గుంటూరు : న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న జీటీ ఎక్స్ప్రెస్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు.  గుంటూరు జిల్లా ఎడ్లపల్లి సమీపంలో ఓ మహిళా ప్రయాణికురాలి మెడలో నుంచి గోల్డ్ చైన్ లాగేందుకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దొంగలు చైన్ లాగి రైలును ఆపి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు.

వెంటనే స్పందించిన ఎస్కార్ట్ పోలీసులు వారిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు దుండగులు పరారీ అవుతూ రాళ్లదాడి చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement