భీంవరంలో దొంగల బీభత్సం | Robbers hulchul in bimvaram in visakhapatnam | Sakshi
Sakshi News home page

భీంవరంలో దొంగల బీభత్సం

Feb 4 2014 8:23 AM | Updated on Aug 30 2018 5:27 PM

విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం భీంవరంలో దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు.

విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం భీంవరంలో దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. ఆ గ్రామంలోని పలు ఇళ్లలోకి చొరబడి వ్యక్తులపై దాడి చేశారు. అనంతరం 9 తులాల బంగారంతో పాటు రూ. 10 వేల నగదు అపహరించుకుని పోయారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

అలాగే నల్గొండ జిల్లా చివ్వెంల మండలం కాశ్మీర్పేటలో కూడా దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా పది ఇళ్లలో చోరీ చేసి అర కిలో బంగారం, రూ. 2 లక్షల నగదు అపహరించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement