'సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలు బయటపెట్టాలి' | Review on dinesh reddy decisions: kichannagari lakshma reddy | Sakshi
Sakshi News home page

'సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలు బయటపెట్టాలి'

Oct 9 2013 3:18 PM | Updated on Mar 28 2018 10:56 AM

మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడారని మంత్రులు శైలజానాథ్‌, గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడారని మంత్రులు శైలజానాథ్‌, గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పదవిలో ఉన్నప్పుడు దినేష్‌రెడ్డి మాట్లాడితే విలువ ఉండేదన్నారు.

హత్యకేసులో ఓ మంత్రి ప్రమేయం ఉందని చెప్పిన దినేష్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆ మంత్రిపై కేసు దాఖలు చేయకుండా సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలను దినేష్‌రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దినేష్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించాలని కేఎల్‌ఆర్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement