స్థానిక సంస్థల బాధ్యత ప్రత్యేకాధికారులదే | Responsibilities of local authorities | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల బాధ్యత ప్రత్యేకాధికారులదే

Aug 23 2013 4:59 AM | Updated on Mar 21 2019 8:35 PM

స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేనందున ప్రత్యేకాధికారులే పూర్తిస్థాయి బాధ్యత వహించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జెడ్పీ ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు.

నల్లగొండ, న్యూస్‌లైన్: స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేనందున ప్రత్యేకాధికారులే పూర్తిస్థాయి బాధ్యత వహించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేసేందుకు చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్, జెడ్పీ ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జెడ్పీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 తొలుత సమావేశానికి హాజరుకాని 14మంది ప్రత్యేకాధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని, సమాచారం అందకపోతే సదరు విభాగం బాధ్యునిపై చర్య తీసుకోవాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకాధికారులు స్థానికంగా ఉంటేనే ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో సకాలంలో డబ్బులు రావన్న అపోహ ప్రజల్లో నెలకొందని,  ప్రజ ల్లోకి వెళ్లి వారి అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. లేదంటే లక్ష్య సాధన కష్టమన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
 
 వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజలు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ వసతిగృహాలతో పాటు పాఠశాలల్లో తాగునీటి కి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలకు సంబంధించి విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ట్రాన్స్‌కో అధికారులతో స మన్వయం ఏర్పరుచుకొని సమస్యను పరిష్కరించాలని సూచిం చారు. జిల్లాకు మంజూరైన 42 వేల పింఛన్‌లు త్వరితగతిన పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రెండో విడత రచ్చబండలో మంజూరైన రేషన్‌కార్డులకు ఫొటోలు సేకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వెంకట్రావ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు, డీఆర్‌డీ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement