రేణుకది మొసలి కన్నీరు: పొన్నం | renuka chowdary shedding crocodile tears, says ponnam prabhakar | Sakshi
Sakshi News home page

రేణుకది మొసలి కన్నీరు: పొన్నం

Feb 9 2014 4:04 PM | Updated on Sep 2 2017 3:31 AM

రేణుకది మొసలి కన్నీరు: పొన్నం

రేణుకది మొసలి కన్నీరు: పొన్నం

గతంలో నరేంద్ర మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తుల కోసం మోడీ వద్ద మోకరిల్లుతున్నారని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

కరీంనగర్‌: గతంలో నరేంద్ర మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తుల కోసం మోడీ వద్ద మోకరిల్లుతున్నారని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. చంద్రబాబు సంప్రదింపులతోనే తెలంగాణపై బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు నిలువరించటం లేదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణపై రేణుకా చౌదరి లాంటి వాళ్లు మొసలి కన్నీరు కారుస్తున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో ఏపీభవన్‌లో రేణుకా చౌదరిని నిన్న తెలంగాణ జేఏసీ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆమె.. తన రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఎన్నో చూశానన్న రేణుక జేఏసీ నేతల వైపు వేలు చూపిస్తూ, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement