కో ఆర్డినేటర్ల తొలగింపు అన్యాయం: ఐవైఆర్‌ | Removal of co-ordinators is unfair: IYR | Sakshi
Sakshi News home page

కో ఆర్డినేటర్ల తొలగింపు అన్యాయం: ఐవైఆర్‌

Sep 3 2017 1:55 AM | Updated on Mar 28 2019 5:23 PM

కో ఆర్డినేటర్ల తొలగింపు అన్యాయం: ఐవైఆర్‌ - Sakshi

కో ఆర్డినేటర్ల తొలగింపు అన్యాయం: ఐవైఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌లో కో ఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం హఠాత్తుగా తొలగిస్తూ తీసుకున్న

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌లో కో ఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం హఠాత్తుగా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం అన్యాయమని ప్రభుత్వ రిటైర్డు ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల్లోంచి తొలగించడం వల్ల ఆ కుటుంబాలు ఇరుకున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ద్వారా పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను అర్హులకు అందజేయడంలో కోఆర్డినేటర్ల కృషి ఎనలేనిదన్నారు. గత ఆరు నెలలుగా కార్పొరేషన్‌కు ఎండీ లేకపోయినా కో ఆర్డినేటర్ల సాయంతోనే పథకాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement