రైల్వే ఉద్యోగాల అభ్యర్థులకు ఊరట | Relief to Seemandhra Railway Group D candidates | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగాల అభ్యర్థులకు ఊరట

Sep 28 2013 1:40 AM | Updated on Aug 20 2018 3:09 PM

రైల్వే గ్రూప్ ‘డి’ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సీమాంధ్ర అభ్యర్థులకు ఊరట లభించింది.

సాక్షి, హైదరాబాద్: రైల్వే గ్రూప్ ‘డి’ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సీమాంధ్ర అభ్యర్థులకు ఊరట లభించింది. సీమాంధ్రలో అధికారులు సమ్మెలో ఉన్నం దున దరఖాస్తులతోపాటు అభ్యర్థులు జత చేయాల్సిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలపై తహసీల్దార్లు సంతకాలు చేయడంలేదు. ఈ నెల 30తో దరఖాస్తు గడువు ముగియనుంది. దీంతో తహసీల్దార్ సంతకం లేకుండా అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ విభాగం అనుమతించింది. రాత పరీక్ష నాటికి వీటిని అందచేస్తామని అఫిడవిట్ జత చేస్తే సరిపోతుందని ప్రకటించింది. దరఖాస్తు గడువును అక్టోబరు 30వరకు పొడిగించింది.

Advertisement
 
Advertisement
Advertisement