భూసేకరణకు రిజిస్ట్రేషన్ ధరే ఇస్తామంటున్న కలెక్టర్ | Registration price to land acquisition : Krishna dist. collector | Sakshi
Sakshi News home page

భూసేకరణకు రిజిస్ట్రేషన్ ధరే ఇస్తామంటున్న కలెక్టర్

Apr 22 2015 2:46 PM | Updated on Sep 3 2017 12:41 AM

గన్నవరం విమానాశ్రయం

గన్నవరం విమానాశ్రయం

కృష్ణా జిల్లా గన్నవరంలోని విమానాశ్రయం విస్తరణకు సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ రేట్లనే ఇస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలోని విమానాశ్రయం విస్తరణకు సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ రేట్లనే ఇస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టరేట్లో కలెక్టర్  అహ్మద్ బాబు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయం విస్తరణ కోసం భూసేకరణపై చర్చ జరిగింది.

విమానాశ్రయం కోసం సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించిందో ఆ ధరనే ఇస్తామని కలెక్టర్ చెప్పారు. అందుకు రైతులు వ్యతిరేకించారు. మార్కెట్ ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దాంతో వారిమధ్య అంగీకారం కుదరలేదు. న్యాయపోరాటానికి సిద్ధమవుతామని రైతులు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement