నిరూపించు లేదా క్షమాపణ చెప్పు!: రాఘవులు | Refute or apologize!: raghavulu | Sakshi
Sakshi News home page

నిరూపించు లేదా క్షమాపణ చెప్పు!: రాఘవులు

May 19 2014 1:26 AM | Updated on Aug 13 2018 8:10 PM

నిరూపించు లేదా క్షమాపణ చెప్పు!: రాఘవులు - Sakshi

నిరూపించు లేదా క్షమాపణ చెప్పు!: రాఘవులు

సీపీఐ నేత నారాయణ తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు డిమాండ్ చేశా రు.

 న్యూఢిల్లీ: సీపీఐ నేత నారాయణ తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు డిమాండ్ చేశా రు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన పొలిట్‌బ్యూరో సమావేశానికి రాఘవులు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు మీడియాకు తెలిపారు. దే శవ్యాప్తంగా బీజేపీ విజయం సాధించడం, సీపీఎం ఓటమి తదితర అంశాలు చర్చకు వచ్చాయన్నారు.

పదేళ్ల కాంగ్రెస్ దుష్టపాలనతో ప్రజలు విసిగిపోవడం వల్లే బీజేపీ విజయం సాధించగలిగినట్టు పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్కరణలు త్వరగా అమలు చేసేందుకు బీజేపీతో సులువని నమ్మే కార్పొరేట్ శక్తులతోపాటు కార్పొరేట్ మీడియా ఏకమై బీజేపీని గెలిపించాయని విమర్శించారు.  మత శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ సహా తమతోకలిసి వచ్చే పార్టీలతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement