పేలిన రెడ్‌మీ నోట్‌–4 సెల్‌ఫోన్‌

Redmi Note 4 Smart Phone Blast in Chittoor - Sakshi

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలో చార్జింగ్‌ పెట్టిన సెల్‌ఫోన్‌ పేలిపోయింది. రామ్‌నగర్‌ కాలనీకి చెందిన సూర్యచంద్ర ఏడాదిగా రెడ్‌మీ నోట్‌–4 ఫోన్‌ వాడుతున్నాడు. శుక్రవారం ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి ఇంటి బయట ఉన్నాడు. ఉన్నట్టుంది శబ్దం రావడంతో లోపలికి వెళ్లి చూడగా ఫోన్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top