30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sanders seized in kadapa | Sakshi
Sakshi News home page

30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Nov 14 2014 9:27 AM | Updated on Oct 22 2018 1:59 PM

రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద శుక్రవారం ఉదయం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కడప(వైఎస్సార్ జిల్లా): జిల్లాలో ఎర్రచందనం అక్రమరవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అటవీ అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నా ఎర్రచందనం దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజాగా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద శుక్రవారం ఉదయం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనంను అక్రమరవాణా చేస్తుండగా పోలీసులు నిఘా ఉంచి ఎర్రచందనం దొంగల గుట్టురట్టు చేశారు. ఈ ఘటనలో 30 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, ముగ్గర్ని అదుపులోకి తీసుకున్నారు.

 

ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కూడా సీజ్ చేశారు.  గురువారం బద్వేల్ పరిధి ఒట్టిమడుగు అటవీప్రాంతంలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement