ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు | red sanders arrested | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు

May 17 2015 2:44 PM | Updated on Aug 20 2018 4:44 PM

వైఎస్సార్ జిల్లా కడప కేంద్రంలో ఇద్దరు ఎర్ర చందనం దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.

కడప: వైఎస్సార్ జిల్లా కడప కేంద్రంలో ఇద్దరు ఎర్ర చందనం దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చాపాడు మండలానికి చెందిన వీరిద్దరూ కడప జిల్లా ఒంటిమిట్ట పోలీసు స్టేషన్‌లోని 18 ఎర్ర చందనం దుంగలను గతవారం మాయం చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం రాత్రి పోలీసులు చాపాడు వద్ద స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరి నుంచి 18 ఎర్ర దుంగలను, రెండు బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement