ఎర్రచందనం కూలీలు అరెస్ట్ : వాహనాలు సీజ్ | red sandalwood seized in nellore district | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం కూలీలు అరెస్ట్ : వాహనాలు సీజ్

Jun 15 2016 12:14 PM | Updated on Sep 4 2017 2:33 AM

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇద్దరు ఎర్రచందనం కూలీలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇద్దరు ఎర్రచందనం కూలీలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం కూలీలను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement