చిత్తూరు బైపాస్లో భారీగా ఎర్రచందనం పట్టివేత | red sandalwood seized in chittoor bypass road | Sakshi
Sakshi News home page

చిత్తూరు బైపాస్లో భారీగా ఎర్రచందనం పట్టివేత

Jul 15 2016 2:26 PM | Updated on Aug 13 2018 3:27 PM

చిత్తూరు బైపాస్ రోడ్డులో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు బైపాస్ రోడ్డులో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దుంగలను తరలిస్తున్న మినీ లారీని వదిలి నిందితులు పరారైయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 45 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement