
నిధుల కోసం ఎర్రచందనం విక్రయం: యనమల
నిధుల సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయించినట్లు రాష్ర్ట ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయించినట్లు రాష్ర్ట ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. ఎర్రచందనం విక్రయించడానికి అంతర్జాతీయ టెండర్లను పిలవాల్సి ఉంటుందని, దీనికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందన్నారు.