బోర్డు తిప్పేసిన కోమలి రియల్ ఎస్టేట్ | Real Estate company dupes customers in tanuku | Sakshi
Sakshi News home page

బోర్డు తిప్పేసిన కోమలి రియల్ ఎస్టేట్

Dec 24 2013 9:29 AM | Updated on Sep 2 2017 1:55 AM

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కోమలి రియల్ ఎస్టేట్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 50 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి ఇప్పుడు కాస్తా అందరికీ టోపీ పెట్టేసింది.

రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ సంస్థకు విశాఖపట్నం, తూర్పుగోదవరి జిల్లాలలో బ్రాంచీలు ఉన్నాయి. సంస్థ చేసిన మోసం తెలియడంతో ఇన్నాళ్లుగా ఈ సంస్థలో ఏజెంటుగా పనిచేసిన సోమరాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement