ప్రాణాలైనా అర్పిస్తాం | Ready to be give life state to be united | Sakshi
Sakshi News home page

ప్రాణాలైనా అర్పిస్తాం

Oct 7 2013 2:26 AM | Updated on Oct 16 2018 6:27 PM

సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తామని సమైక్యవాదులు రాజు, తిరుపాల్‌లు ఆదివారం సాయంత్రం పాత బస్టాండు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఉన్న మున్సిపల్ ట్యాంకు ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యారు.

 పులివెందుల అర్బన్/టౌన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తామని సమైక్యవాదులు రాజు, తిరుపాల్‌లు ఆదివారం సాయంత్రం పాత బస్టాండు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఉన్న మున్సిపల్ ట్యాంకు ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ సమైక్యవాదులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. గంటసేపు ట్యాంకుపైకి ఎక్కి దూకుతామని పేర్కొనడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం మున్సిపల్ ట్యాంకుపైకి ఎక్కిన రాజు, తిరుపాల్‌లను దిగాలంటూ సమైక్యవాదులు కోరారు. ఎంతసేపటికి దిగి రాకపోవడంతో డీఎస్పీ హరినాథబాబు, సీఐ భాస్కర్‌లు జోక్యం చేసుకొని మీ కుటుంబ సభ్యులకోసమైన దిగిరావాలని కోరారు.
 
 సమైక్యాంధ్ర కోసం ప్రాణ త్యాగం చేయవద్దని కోరారు. సమైక్యవాదులు కూడా కిందికి దిగి రావాలంటూ పెద్ద ఎత్తున సమైక్య నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రజలందరూ అక్కడికి చేరుకొని సమైక్యవాదులు కిందికి దిగిరావాలని మేమంతా సమైక్యాంధ్ర కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని.. కానీ శాంతియుతంగానే ఉద్యమాలు చేస్తూ సమైక్యాంధ్ర సాధించుకుందామని చెప్పారు. దీంతో సమైక్యవాదులు మున్సిపల్ ట్యాంకు నుంచి కిందికి దిగడంతో సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement