మహిళపై సామూహిక అత్యాచారం | Raping woman | Sakshi
Sakshi News home page

మహిళపై సామూహిక అత్యాచారం

Nov 28 2014 2:50 AM | Updated on Aug 21 2018 5:46 PM

చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఓ మహిళ (56)పై బుధవారం రాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు.

హిందూపురం :   చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఓ మహిళ (56)పై బుధవారం రాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి వేళ వాకింగ్ చేస్తుండగా ముఖానికి గుడ్డ కట్టుకున్న ముగ్గురు యువకులు బలవంతంగా తనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిపింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను 108 వాహనంలో స్థానికులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు. రూరల్ సీఐ శివనారాయణ స్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనపై విచారణ చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement