మైనర్ బాలికపై అత్యాచారం | Raping on minor girl | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై అత్యాచారం

Feb 27 2015 1:58 AM | Updated on Aug 11 2018 8:45 PM

ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు కొత్తపేట పోలీస్‌స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

భవానీపురం : ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు కొత్తపేట పోలీస్‌స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిట్టినగర్ లంబాడీపేటలో బొడ్డు వీరమ్మ మూగ, చెవిటిదైన తన మనుమరాలుతో నివసిస్తోంది. ఈ మైనర్ బాలికకు తల్లిదండ్రులు చనిపోయారు. నాయనమ్మ వద్దే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన వీరమ్మ తన బంధువు ఒకరు సూర్యారావుపేటలోని ఒక హాస్పటల్‌లో ఉండడంతో పరామర్శకు వెళ్లింది.

ఈ క్రమంలో బాలిక ఇంటిపై అంతస్తులో మార్బుల్ పని చేసుకునే మురళి అనే యువకుడు మైనర్ బాలికను టిఫిన్ పెడతా రమ్మని పైకి పిలిచి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక బాబాయి వీరమ్మకు సమాచారం అందించాడు. వెంటనే ఇంటికి వచ్చిన వీరమ్మ బాలిక నుంచి వివరాలను అడిగి తెలుసుకుని గురువారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement