రాములోరి కోటి తలంబ్రాలకు వరినాట్లు | ramulori kalyanothsavam in ontimitta | Sakshi
Sakshi News home page

రాములోరి కోటి తలంబ్రాలకు వరినాట్లు

Aug 9 2015 8:32 PM | Updated on Sep 3 2017 7:07 AM

హనుమాన్ వేషధారితో కలసి వరి నాట్లు వేస్తున్న భక్తులు

హనుమాన్ వేషధారితో కలసి వరి నాట్లు వేస్తున్న భక్తులు

వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందజేయాలని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం సంకల్పించింది.

రాజానగరం: వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందజేయాలని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం సంకల్పించింది. అందుకోసం రాజానగరం మండలంలోని వెలుగుబందలో ఆదివారం హనుమంతుని వేషధారణలో ఉన్న ఓ భక్తునితో సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు నాట్లు వేయించారు. అంతకుముందు నారుమడికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement