breaking news
kalyanam apparao
-
వినూత్న నిరసన
రాజమహేంద్రవరం కల్చరల్ : సాగరతీర ప్రేమ కాదు.. సాగరమంత ప్రేమ కావాలని కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకుడు కల్యాణం అప్పారావు పేర్కొన్నారు. విశాఖలో జరగనున్న బీచ్లవ్ కార్యక్రమానికి నిరసన వ్యక్తం చేయడానికి ఆయన మంగళవారం అంబేడ్కర్ నగర్లోని రామాలయం వద్ద గోపూజను నిర్వహించారు. గద్దెనెక్కిన పాలకులకు సద్భుద్ధి ప్రసాదించాలని గోమాతను కోరుతూ పూజలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజలను సమ్మోహనపరచడానికి కాదు, సేవాభావంతో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించాలని ఆయన కోరారు. స్థానిక మహిళలు పాల్గొన్నారు. -
రాములోరి కోటి తలంబ్రాలకు వరినాట్లు
రాజానగరం: వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందజేయాలని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం సంకల్పించింది. అందుకోసం రాజానగరం మండలంలోని వెలుగుబందలో ఆదివారం హనుమంతుని వేషధారణలో ఉన్న ఓ భక్తునితో సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు నాట్లు వేయించారు. అంతకుముందు నారుమడికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు.