7న డా.రామినేని ఫౌండేషన్‌ పురస్కారాలు ప్రదానం | Ramineni Foundation Convener Pathuri Nagabhushanam Announce Visista Visesha Purshkar Awards | Sakshi
Sakshi News home page

7న డా.రామినేని ఫౌండేషన్‌ పురస్కారాలు ప్రదానం

Oct 5 2018 5:19 AM | Updated on Oct 5 2018 5:19 AM

Ramineni Foundation Convener Pathuri Nagabhushanam Announce Visista Visesha Purshkar Awards - Sakshi

ఫౌండేషన్‌ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న పాతూరి నాగభూషణం

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ పురస్కారాలు ఈ నెల 7న  మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో అందజేస్తామని ఫౌండేషన్‌ చైర్మన్‌ రామినేని ధర్మ ప్రచారక్, కన్వీనర్‌ పాతూరి నాగభూషణం తెలిపారు.  విజయవాడలోని ఓ హోటల్‌లో గురు వారం ఫౌండేషన్‌ బ్రోచర్‌ను ఆవిష్క రించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు విశిష్ట పురస్కారం, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌రెడ్డి, మెజీషియన్‌ చొక్కాపు వెంకట రమణకు విశేష పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్, బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement