
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నటుడు రాంచరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు.
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నటుడు రాంచరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద రామ్‌చరణ్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, నడక దారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.