విద్యను వ్యాపారం చేస్తే సహించం: మంత్రి

Rajajanna Badibata tobe start from tomarrow says Adhi mulapu Suresh - Sakshi

సాక్షి, అమరావతి : రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న బడి బాట నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 100 శాతం పిల్లలు స్కూళ్లలో చేరేలా చేస్తామన్నారు. మంత్రి మాట్లాడుతూ.. 'ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించేందుకు కమిటీ వేస్తున్నాము. విద్యను వ్యాపారం చేస్తే సహించం. విద్యా సంస్కరణల కోసం నూతన విద్యా విధానాన్ని నిపుణులతో రూపొందిస్తాము. 2019 నుండి 2024 వరకు చేయబోయే మార్పులతో నూతన పాలసీ ఉంటుంది. అమ్మ ఒడి పథకాన్ని జనవరి 26 నుండి అమలు చేస్తాం. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలి క్యాబినెట్ నిర్ణయాలతోనే విద్యావిధానంలో సంస్కరణలు మొదలయ్యాయి' అని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top