‘వ్యవసాయరంగంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది’

Raithubarosa centers helpful for farmers says Darmana Prasadarao - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : చితికిపోయిన వ్యవసాయ వృత్తిని గాడిలో పెట్టి రైతులను సంతోషపెట్టాలనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుందని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. మేనిఫెస్టోలో రూ.12వేల5వందలు ఇస్తామని చెప్పి రూ.13వేల5వందలు రైతులకు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి రూ.15వందల కోట్లతో విద్యుత్ లైన్లు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. 

రైతు భరోసా కేంద్రం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. సకాలంలో రైతులకు సలహాలు ఇచ్చే వ్యవస్థ ఇంతవరకు లేదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి ధరను స్థిరీకరించిందని పేర్కొన్నారు. దేశంలోనే వ్యవసాయరంగంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వంశధార నది, బంగాళాఖాతంలో కలిసే చోట నది దిశ మారిపోయిందన్నారు. ఏడున్నర కోట్లతో రివర్ కన్సర్వేషన్ జోన్‌లో నివారణా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కళింగపట్నం బీచ్ కోతకు గురవ్వకుండా కాపాడేందుకు ఇంజనీరింగ్ అనుమతులు వచ్చాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top