ఈ నెల 28 నాటికి పశ్చిమ మధ్య వాయవ్య బంగాళఖాతంలో అల్పపీడం ఏర్పటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది.
విశాఖపట్నం: ఈ నెల 28 నాటికి పశ్చిమ మధ్య వాయవ్య బంగాళఖాతంలో అల్పపీడం ఏర్పటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.