'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం' | raghuveera slams on ap budget-2015 | Sakshi
Sakshi News home page

'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం'

Mar 13 2015 10:07 AM | Updated on Aug 18 2018 9:13 PM

'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం' - Sakshi

'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం'

'మేం చేతకాని వాళ్లం...దద్దమ్మలం...పరిపాలన చేయడం తెలియదు' అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు తాముగా బడ్జెట్ ద్వారా చెప్పుకుందని ఏపీ పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

అనంతపురం: 'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం..పరిపాలన చేయడం తెలియదు' అని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం తమకు తాముగా బడ్జెట్ ద్వారా చెప్పుకుందని ఏపీ పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురం టౌన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ద్రోహం చేసేదిగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నమైన బడ్జెట్ అని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీల అమలు కంటే వాటిని మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తుందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement