గొంతు కోసుకుని ఖైదీ ఆత్మహత్యాయత్నం | prisoner suicide attempt in rajamundry central jail | Sakshi
Sakshi News home page

గొంతు కోసుకుని ఖైదీ ఆత్మహత్యాయత్నం

Jun 22 2015 2:21 PM | Updated on Sep 3 2017 4:11 AM

గొంతు కోసుకుని ఖైదీ ఆత్మహత్యాయత్నం

గొంతు కోసుకుని ఖైదీ ఆత్మహత్యాయత్నం

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రాజమండ్రి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ సత్యనారాయణపురంకు చెందిన టి.మోహన వెంకట దుర్గా ప్రసాద్ ఓ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రాజమండ్రి జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. అయితే, తనకు న్యాయవాదిని కేటాయించలేదంటూ దుర్గా ప్రసాద్ సోమవారం మధ్యాహ్నం  స్నానాల గది తలుపు రేకుతో పీక కోసుకున్నాడు. రక్తస్రావం అవుతున్న అతన్ని జైలు సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
 

Advertisement
 
Advertisement
Advertisement