కడప సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య | prisoner committed suicide in kadapa central jail | Sakshi
Sakshi News home page

కడప సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య

May 5 2015 5:51 PM | Updated on Nov 6 2018 7:56 PM

జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కడప :  జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం వైఎస్సార్ కడప జిల్లాలోని కేంద్ర కారాగారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతరపురం జిల్లా తలపుల మండలానికి చెందిన కృష్ణమూర్తికి తన భార్యను హత్య చేసిన కేసులో అనంతపురం జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే కృష్ణమూర్తిని జైలు అధికారులు కడప కేంద్రకారాగారానికి తరలించారు. కాగా మంగళవారం జైలులో ఉన్న బాత్‌రూంలో ఉరి వేసుకొని కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement