తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి | President Ram Nath Kovind Visits Tiruchanur | Sakshi
Sakshi News home page

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

Sep 1 2017 4:46 PM | Updated on Jul 29 2019 7:35 PM

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి - Sakshi

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌:  రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ఆయన తొలుత ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం అమ్మవారిని దర్శించుకుని  ప్రత్యేక పూజలు చేశారు.
 
కాగా అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనార్థం తిరుచానూరు బయలుదేరారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement