నెత్తిపై రాయి.. నాగిని డాన్స్‌ | Prakasam Darshi Man Punakam with Stone | Sakshi
Sakshi News home page

May 24 2018 3:52 PM | Updated on May 24 2018 4:12 PM

Prakasam Darshi Man Punakam with Stone - Sakshi

వాట్సాప్‌లో వీడియోల ఆధారంగా దృశ్యాలు

సాక్షి, ప్రకాశం: మూఢనమ్మకాలను రూపుమాపేందుకు జన విజ్ఞాన వేదికలు కృషి చేస్తుంటే.. కొందరు మాత్రం ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ కుర్రాడు పూనకంతో ఊగిపోతూ హల్‌ చల్‌ చేశాడు. స్వయంభూ శివలింగం వెలిసిందంటూ దర్శి మండలం శివరాజ్‌ నగర్‌లో హడావుడి చేసాడు. శ్రీను అనే యువకుడు స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ, హఠాత్తుగా ఓ రాయిని శివలింగంగా చెబుతూ నెత్తిన పెట్టుకొని పూనకంతో ఊగిపోయాడు.

తనను ముట్టుకోవద్దంటూ ఊగిపోతూ ప్రజల మధ్యలోకి వచ్చి ఆ రాయికి పూజలు చేశాడు. ఊరిపోలిమేరలో వెలసిన శివలింగానికి వెంటనే గుడికట్టాలని, లేదంటే ఊరికే అరిష్టం అంటూ నాగిని డాన్స్‌తో ఊగిపోయాడు.  అతన్ని చూసిన గ్రామస్థులు స్వామి.. స్వామి అంటూ అతని చుట్టూ చేరటం విశేషం. ప్రస్తుతం వాట్సాప్‌లో అందుకు సంబంధించిన వీడియోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement