ప్రాణం తీసిన చంద్రబాబు హడావుడి క్రెడిట్‌ చోరీ! | Veligonda Project Tragic Turn: A Resident of Kalanuthala Village Passes Away | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన చంద్రబాబు హడావుడి క్రెడిట్‌ చోరీ!

Aug 31 2026 4:48 PM | Updated on Aug 31 2026 5:00 PM

Veligonda Project Tragic Turn: A Resident of Kalanuthala Village Passes Away

ప్రకాశం: చంద్రబాబు హడావుడి క్రెడిట్‌ చోరీకి ఓ నిండు ప్రాణం బలైపోయింది. వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితురాలైన రోశమ్మ అనే వృద్ధురాలు.. ఊరు నుంచి బయటకు వెళ్లిన మరుక్షణం తుదిశ్వాస విడిచింది. చంద్రబాబు హడావుడి కార్యక్రమంలో భాగంగా కలనూతల గ్రామాన్ని ఖాళీ చేయించిన సందర్భంలో ప్రకాశం జిల్లా కలనూతల గ్రామానికి చెందిన రోశమ్మ కుటుంబం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. కలనూతల నుంచి గొబ్బూరు వెళ్లిందా కుటుంబం. అయితే అక్కడ అద్దె ఇళ్లు దొరకలేదు. 

దాంతో రాత్రంతా చెట్టు కిందే జాగారం చేసింది రోశమ్మ కుటుంబం. మరొకవైపు తన కుటుంబంలోని మరో ఐదుగురి పరిహారం ఇంకా రాలేదని ఆవేదన చెందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత పొలం వదిలి ఇలా అనాథలుగా రోడ్డుపై పడిపోయామని పదే పదే కలత చెందుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఊపిరి ఆగిపోయింది. 

ఎక్కడైతే చెట్టు కింద ఉన్నారో అదే చెట్టు కిందే తెల్లారేసరికి ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంత్యక్రియలు  ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితుల్లో గొబ్బూరు గ్రామస్థుల సాయంతో ఆమెను అక్కడే ఖననం చేశారు.

ఇదీ చదవండి
సీఎం చంద్రబాబు తీరుతో మంత్రి ఆనం మనస్తాపం

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement