మార్కాపురం(ప్రకాశం జిల్లా): చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడి మరీ చేసిన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అవమానం జరిగింది. ప్రారంభోత్సవ పూజ సమయంలో మంత్రి ఆనంని వెనక్కి వెళ్లమని చెప్పిన చంద్రబాబు.. అదే స్థానంలో మరో మంత్రి నిమ్మల రామానాయుడిని ముందుకు రమ్మన్నారు.
ఆనం రామనారాయణరెడ్డిని అక్కడ ఉంచి నిమ్మలను ముందుకు పిలిచినా అది మంత్రి ఆనంకు అవమానంగా ఉండేది కాదు. కానీ ఒక మంత్రిని వెనక్కి పంపీ మరో మంత్రిని పిలవడమే చర్చనీయాంశమైంది.
చంద్రబాబు పక్కనే ఉన్న మంత్రి ఆనంను పలుమార్లు వెనక్కి వెళ్లమంటూ సంజ్ఞలు చేశారు చంద్రబాబు చివరకు ఆయన్ను వెనక్కి పంపీ రామానాయుడిని ముందుకు పిలిపించుకున్నారు. చంద్రబాబు తీరుతో ఆనం మనస్తాపం చెంది అక్కడ నుండి వెళ్లిపోయారు. పూలు వెయ్యకుండానే అలిగి వెళ్లిపోయారు మంత్రి ఆనం. ఆపై జరిగిన జ్యోతి ప్రజ్వలనకు కూడా హాజరు కాలేదు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

ఇదీ చదవండి:
తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు బాబు అబద్ధాలు..‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ


