
సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం పెరవాలి నుంచి 184వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మునిపల్లి, పెండ్యాల క్రాస్ రోడ్, కల్వచర్ల, డి ముప్పవరం చేరుకున్న తరువాత వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సమిస్ర గూడెం మీదుగా నిడదవోలు చేరుకుంటారు. నిడదవోలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు.