కారులో గంజాయి స్వాధీనం | Possession of marijuana in the car | Sakshi
Sakshi News home page

కారులో గంజాయి స్వాధీనం

Dec 13 2014 3:21 AM | Updated on Aug 21 2018 5:46 PM

మండలంలోని ఎల్లసిరి గ్రామంలో కారులో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిట్టమూరు: మండలంలోని ఎల్లసిరి గ్రామంలో కారులో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఇన్‌చార్జి సీఐ రత్నయ్య కథనం మేరకు... ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఎల్లసిరిలో బ్లాక్ కలర్ ఉన్న ఫోర్డ్ ఫియోస్టో ఏపీ 16ఏఏ 4658 కారు అనుమానాస్పదంగా ఉండడంతో చిట్టమూరు ఎస్సై రవినాయక్‌కు సమాచారం అందింది. కారును పరిశీలించగా లాక్ చేసి ఉంది. దీంతో శుక్రవారం నెల్లూరు నుంచి కారు మెకానిక్‌ను పిలిపించి లాక్ ఓపెన్ చేశారు. తహశీల్దార్ వెంకట సునీల్ ఆధ్వర్యంలో కారులో ఉన్న 142 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి బ్లూ లగేజీ కవర్లలో ఒక్కో ప్యాకెట్లో సుమారు 2.5 కిలోలో ఉంది. మొత్తం 317 కిలోలు ఉందని, వీటి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందన్నారు. తహశీల్దార్‌ఎన్‌డీపీఎస్ యాక్ట్ ద్వారా వివరాలు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. కారుకు రెండు నంబర్లు పేట్లు ఉన్నాయని, ఒకటి ఆంధ్రా రిజిస్ట్రేషన్ కాగా, వెనుక పక్క టీఎన్ 07.ఏఏ.3567 నెంబరు ఉందన్నారు. ఈ నెంబర్లు కూడా ఫేక్ అని పేర్కొన్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 
 గ్రామీణ ప్రాంతంలో గంజాయి
 లభించడంపై పలు అనుమానాలు:
 మండలంలో ఇంత వరకు గంజాయి దొరికిన దాఖలాలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఐదు రోజులుగా గ్రామం నడి బొడ్డున ఈ ప్రాంతం వారికి సంబంధాలు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో గంజాయితో సహా కారు వదిలి వెళ్లడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement