'త్వరలో10 రోజుల్లోనే పోలీస్ వెరిఫికేషన్' | Police verification for passports with in 10days, surendar reddy | Sakshi
Sakshi News home page

'త్వరలో10 రోజుల్లోనే పోలీస్ వెరిఫికేషన్'

Jun 24 2014 1:04 PM | Updated on Aug 21 2018 9:20 PM

పాస్పోర్ట్ జారీలో పోలీస్ వెరిఫికేషన్ 16 రోజుల్లో పూర్తి చేస్తునందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం అవార్డులు అందచేశారు.

న్యూఢిల్లీ : పాస్పోర్ట్ జారీలో పోలీస్ వెరిఫికేషన్ 16 రోజుల్లో పూర్తి చేస్తునందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం అవార్డులు అందచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ అధికారి అనురాధ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి సురేందర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా  హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి  శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ 16 రోజుల్లోనే పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసి, వేగంగా పాస్పోర్టులు జారీ చేయటాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రపద్రేశ్, తెలంగాణ ప్రభుత్వాలే ఈ ప్రక్రియలో ముందున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారాలతో పాస్పోర్ట్ వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. ముందు ముందు పది రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తయ్యేల చూస్తామని ఆయన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement