కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి | police ridings on hen fighting centre in west godavari district | Sakshi
Sakshi News home page

కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

Mar 23 2016 5:07 PM | Updated on Aug 21 2018 5:46 PM

పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేల స్థావరంపై బుధవారం పోలీసులు మెరుపు దాడి చేసి పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేల స్థావరంపై  బుధవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో కోడిపందెం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 10 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.66 వేల నగదు, 2 కార్లు, 4 బైక్‌లు, 2 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ సైదా నాయక్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement