అంతః'కరోనా'శుద్ధితో..

Police Officials Duty in Lockdown Time Srikakulam - Sakshi

సమాజమంతా కరోనాకు భయపడుతుంటే.. కొందరు మాత్రం యోధుల్లా పోరాడుతున్నారు. జనాలకు రక్షణ కవచాల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుటుంబాలను వదిలి, ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. అందులో కొందరు వీరు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.   

పగలు రాత్రి కర్తవ్య దీక్షలో..
జి.సిగడాం ఎస్‌ఐ కె.శిరీష మండలంలో 144 సెక్షన్‌ను సమర్థంగా అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రజలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి గ్రామంలో చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ ఎలా అమలవుతోందో పర్యవేక్షించేందుకు గస్తీ ఏర్పాటు చేశా రు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మండలమంతా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజా సేవ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కర్తవ్య దీక్షలో గడుపుతున్నారు. –జి.సిగడాం

పెళ్లయి నెల రోజులే అయినా..
కొత్తూరు: పెళ్లయి నెల రోజులే అయ్యింది. అప్పుడే ప్రజలకు ఆపద దాపురించింది. ఈ ఆపత్కా లంలో నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ముందుకువెళ్తున్నారు కొత్తూరు ఎస్‌ఐ బాలకృష్ణ. బాలకృష్ణకు పెళ్లి జరిగి నెల గడుస్తోంది. ఇంతలో లాక్‌డౌన్‌ ప్రకటించడం, దీన్ని సమర్థంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసులపై పడడం జరిగింది. అప్పటి నుంచి బాలకృష్ణ నిరంతరం విధుల్లోనే ఉంటున్నారు. నిత్యం తన సిబ్బందితో రోడ్లపై తిరుగుతూ జనాలకు అవగాహన కల్పిస్తున్నారు.  

ప్రయాణంలో ప్రచారం
ఎల్‌.ఎన్‌.పేట: ఈయన పేరు సనపల కిరణ్‌కుమార్‌. ఊరు ఎల్‌.ఎన్‌ పేట మండలం చింతలబడవంజ సెంటర్‌. ఇదే మండలం లక్ష్మీనర్సుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో మేల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. కరోనా(కోవిడ్‌–19) విజృంభిస్తుందని ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రజల వద్దకు వెళుతూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. తన బైక్‌పై ‘కరోనా వైరస్‌ నుంచి కాపాడుకోవాలంటే దయచేసి ఇంట్లోనే ఉండండి’ అంటూ బోర్డు ప్రదర్శిస్తున్నారు.  

జిల్లాలో ఎవరూ ఆకలితో ఉండకూడదు: కలెక్టర్‌
శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా నిర్వహించిన లాక్‌డౌన్, 144 సెక్షన్‌ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదని కలెక్టర్‌ జె.నివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారు, పేదలు, నిరాశ్రయులు అక్కడక్కడా ఉన్నారని, వారికి శ్రీకాకుళం, ఇతర మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాలకు వారు వెళ్లి తాత్కాలిక పునరావాసం పొందవచ్చని, శ్రీకాకుళంలో ఉన్నవారికి రెడ్‌క్రాస్‌ వారు ఆహారం అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-05-2020
May 30, 2020, 22:30 IST
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
30-05-2020
May 30, 2020, 21:12 IST
న్యూఢిల్లీ: కరోనా క్లిష్ట సమయంలో కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ విమర్శలకు దిగుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ...
30-05-2020
May 30, 2020, 20:45 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్నా ‘డోంట్‌ కేర్‌’ అంటూ గడిపేస్తున్నారు అమెరికన్లు. కరోనా మరణాలు లక్ష దాటినా అమెరికా...
30-05-2020
May 30, 2020, 19:30 IST
న్యూఢిల్లీ: కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. కోవిడ్‌ చికిత్సలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సేవలపై...
30-05-2020
May 30, 2020, 17:42 IST
లాక్‌డౌన్ సడలింపులతోనే నగరాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతోందని వెల్లడించారు.
30-05-2020
May 30, 2020, 17:15 IST
అంటే కరోనా కేసులు బయట పడకుండానే పాడె కడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.
30-05-2020
May 30, 2020, 17:04 IST
గడిచిన 24 గంటల్లో 114 మంది పోలీసులు కోవిడ్‌ బారిన పడ్డారు. దాంతో రాష్ట్ర పోలీసుల్లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య...
30-05-2020
May 30, 2020, 16:29 IST
ముంబై: మహమ్మారి కరోనాతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్ర శనివారం కాస్త ఊరటనిచ్చే కబురును పంచుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్‌...
30-05-2020
May 30, 2020, 15:55 IST
లక్నో : తన చావుకు లాక్‌డౌన్‌ పొడిగింపే కారణమంటూ ఒక వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి శుక్రవానం రైలు కింద...
30-05-2020
May 30, 2020, 15:17 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్ తగిలింది. ఎయిరిండియా పైలట్ ఒకరు కరోనా బారిన పడటంతో...
30-05-2020
May 30, 2020, 13:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా  వైరస్ విస్తరణపై భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్...
30-05-2020
May 30, 2020, 13:49 IST
సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల...
30-05-2020
May 30, 2020, 13:20 IST
జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల గ్రామ పంచాయతీలో మరోమారు కరోనా కలకలం రేగింది. ఉమ్మడి జిల్లాలో తొలి రెండు కేసులు కావేరమ్మపేటలో...
30-05-2020
May 30, 2020, 13:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులకు ఊరటనిచ్చేలా పెట్రోలు కూడా ఇకపై డోర్ డెలివరీ కానుంది. ప్రజల సహాయార్ధం పెట్రోల్ సీఎన్‌జీని ఇంటివద్దకే...
30-05-2020
May 30, 2020, 12:54 IST
నెల్లూరు, తడ: తడ మండలంలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఎంపీడీఓ జి.శివయ్య సమాచారం మేరకు తడకండ్రిగ పంచాయతీ పరిధిలోని...
30-05-2020
May 30, 2020, 10:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తన యాంటీ-వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరుతూ భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్‌కు...
30-05-2020
May 30, 2020, 10:25 IST
చెన్నై,తిరువొత్తియూరు: బిచ్చమెత్తిగా వచ్చిన నగదును ఓ వృద్ధుడు కరోనా నివారణకు సాయంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. శివగంగై సమీపంలోని...
30-05-2020
May 30, 2020, 09:41 IST
లండన్‌: కరోనా సంక్షోభ సమయంలో యూకేలో ప్రజలకు సేవ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ వైద్యుడు హోటల్‌ గదిలో...
30-05-2020
May 30, 2020, 09:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన...
30-05-2020
May 30, 2020, 09:33 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top